
Kalinga Times, Hyderabad : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో విద్యుత్ మోటర్ కాలి పోయి మూడు రోజులు అవుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కొంతమంది వాటర్ ట్యాంకర్ లతో కలుషితమైన గోపి చెరువు నీటిని ప్రజలకు విక్రయిస్తున్నారు, దీంతో వాంబే కాలనీ, రాజీవ్ గృహకల్ప నివాసులు డెంగ్యూ మలేరియా రోగాల బారినపడి ఒక పిల్లవాడు చనిపోయాడు, ప్రస్తుతం మంచినీరు పంపిణీ అయ్యే దానికి మురికి నీరు కలుషితం కావడంతో ప్రజలు అదే నీటిని తాగి రోగాల పాలవుతున్నారు, ఇంత జరుగుతున్నా స్థానిక కార్పొరేటర్ పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ ప్రజలు వాపోతున్నారు, ఇదే అదనుగా భావించిన వాటర్ ట్యాంకర్ యజమానులు చెరువు నీటిని తెచ్చి విక్రయించి వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు, ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి విద్యుత్ మోటార్ ను రిపేరు చేయించాలని స్థానికులు కోరుతున్నారు