social
రక్తదానం పై అపోహలు వీడాలి
Kalinga Times, Sri Rampur :నేషనల్ స్పోర్ట్స్ డే మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా 7 స్టెప్స్ యూత్ క్లబ్ వారు గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కె. లక్ష్మి నారాయణ హాజరయ్యారు .ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీమని ..రక్తదానం పై అపోహలు వీడాలన్నారు. సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయవచ్చు అని తెలిపారు.స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేయాలన్నారు.జిల్లాలో తలసేమియా పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తమార్పిడి చేయాలని సూచించారు.సింగరేణి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.తలసిమియా పిల్లల ప్రాణాలు కాపాడటానికి సంస్థ తరపున కృషి చేస్తామన్నారు. శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి తరుపున రెడ్ క్రాస్ సొసైటీ మరియు 7 స్టెప్స్ యూత్ నిర్వహకులను ఈ సంధర్భంగా ఆయన అభినందించారు అనంతరం రక్తదాతకు ప్రశంస పాత్రలను అందజేసారుఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ గోవిందా రాజు తుకరం, శ్రీరాంపూర్ ఏరియా టి.బి.జి.కె.స్ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి,7 స్టెప్స్ ఆదక్షుడు ఆర్ములా రాజు, మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి ,వైస్ ఛైర్మన్ చందూరి మహేందర్, ప్రిన్సిపాల్ సాయి భూషణ్,వైస్ ప్రిన్సిపాల్ ఇబ్రాహీం, రెడ్డి బ్లడ్ బ్యాంక్ వైద్యుడు డాక్టర్ విష్ణుమూర్తితలసిమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంజిత్ కుమార్ , లైఫ్ కేర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ వెంకటేష్ భారతీయన్ యువసేన ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు