social
ర్యాష్ డ్రైవింగ్ చేస్తే …ఇక దూల తీరిపోద్ది
Kalinga Times, Hyderabad : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానుంది. సురక్షిత ప్రయాణం కోసం కేంద్రం రూపొందించిన ఈ చట్టాన్ని పార్లమెంట్ ఇటీవలె ఆమోదించింది. కాగా సవరణ చేసిన మోటార్ వాహన చట్టం అమలుకు కేంద్రం సిద్ధమైంది. ప్రయాణ సమయంలో కొత్త చట్టంలోని నింబంధనలు పాటించకుంటే వేల రూపాయలు చెల్లించాల్సిందే.కాగా కొత్త చట్టంలో జరిమానాను 5 నుంచి 10 రెట్లు పెంచారు.
మైనర్లు తప్పు చేస్తే …
కొత్త చట్టం ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. చిన్న పిల్లలు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానా విధిస్తారు. అంతే కాదు వాహనాలకు ఏడాది పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. దీంతో పాటు మైనర్లను జువెనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారణ చేపట్టనున్నారు. తీవ్రతను బట్టి జైలు శిక్షలపై కూడా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే భారీ జరిమానా విధించేందుకు రంగం సిద్ధం చేశారు.
వెహికల్ యాక్ట్ కొత్త రూల్స్
1 మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానా, ఏడాది పాటు వాహన రిజిస్ట్రేషన్ రద్దు
2 అనుమతికి మించి వాహనం వేగంగా నడిపతే రూ.5 వేలు జరిమానా
3 ట్రాఫిక్ లైన్ జంప్ చేసినా.. రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళితే రూ.5 వేలు జరిమానా
4 ఎమర్జెన్సీ వాహనానికి దారి ఇవ్వకపోతే రూ.10వేలు జరిమానా
5 ఓవర్ లోడింగ్ లేదా త్రిపుల్ డ్రైవింగ్ కు రూ.20 వేలు జరిమానా
6 లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు జరిమానా
7 సీట్ బెల్ల్ లేకపోయినా..హెల్మెంట్ లేకపోయినా రూ.1000 జరిమానా
8 డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడితే రూ.5 వేల జరిమానా
9 ర్యాష్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు జరిమానా
10 మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా
ఇదిలా ఉంటే జైలు శిక్షలపై కూడా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది