National
కూకట్ పల్లిలో సుష్మాస్వరాజ్ సంతాప సభ..
Kalinga Times, Hyderabad : కూకట్ పల్లి కె పి హెచ్ బి కాలనీ రమ్య గ్రౌండ్ లో , బి జె పి నాయకులు పన్నాల హరీష్ రెడ్డి ఆద్వర్యం లో , బి జె పి కేంద్రమంత్రి స్వర్గీయ సుష్మ స్వరాజ్ సంతాప సభ నిర్వహించి నివాళులు అర్పించారు ,ఈ కార్యక్రమం లో బి జె పి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు,బాలాజీ నగర్ కార్పొరేటర్ కావ్య హరీష్ రెడ్డి ,బి జె వై ఎం విజిత్ వర్మ ,తెలంగాణ ఉద్యమ కారులు ,రచయితలు ,కవులు కళాకారులు పాల్గొన్నారు .ఈ సందర్బంగా కాంతారావు మాట్లాడుతూ ,తెలంగాణ చిన్నమ్మ గా పిలువబడుతున్న సుష్మ స్వరాజ్ గారు ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరమని ,దేశానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ,విదేశాల్లో చిక్కుకున్న వారిని మన దేశానికి రప్పించటం ,అలాగే తెలంగాణ పౌరుల కోసం లోక్ సభలో ఆమె ప్రసంగం అద్భుతం అని కొనియాడారు,ఆమె కోరికల్లో రామమందిర నిర్మాణం ,అలాగే కొన్ని దేశానికి సంబందించిన అంశాలు ఉన్నాయని అవి నెరవేరితే ఆమె ఆత్మ శాంతిస్తుందని అన్నారు .