social
సికింద్రాబాద్,కంటోన్మెంట్ లలో వై భవంగా నాగుల పంచమి వేడుకలు
Kalinga Times,Hyderabad : శ్రావణ సోమవారం,నాగుల పంచమి(చవతి) సందర్భుంగా ఈ రోజు వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి.సికింద్రాబాద్,కంటోన్మెంట్,పాతబోయిన్ పల్లి తదితర ప్రాంతాలలో భక్తులు ముఖ్యంగా మహిళలలు నాగుల పంచమి వేడులు భక్తి శ్రద్ధలతో శ్రీ రేణుక ఎల్లమ్మ,శ్రీ నల్ల పోచ్చమ్మ,శ్రీ నాగ దేవత తదితర దేవాలయాలలో ఉన్న పుట్టలలో,ప్రతిమలలో పసుపు కుంకుమలజల్లి పాలు పోసి,కోబ్బరి కాయలు కొట్టి తమతమ కోరికలను తీర్చుకున్నారు. కంటోన్మెంట్ లోని తిర్మలగిరి పరిధిలో ఉన్న చారిత్రాత్మకమైన శ్రీ నాగదేవత దేవాలయంలో భక్తులు పోటెత్తారు. జంటనగరాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నరు. ఈ సందర్భంగా అమ్మవారికి కలశ పూజ,వినాయకుని పూజలతో పాటు అమ్మవారికి కళ్యాణోత్సవం కార్యక్రమాలు జరిగాయి.శ్రీ నాగదేవత,శ్రీ నారాయణ స్వామి,శ్రీ జయలక్ష్మీ అమ్మ గురుస్థాన కమిటి వారు ఈ సందర్భంగా విశాలమైన ఈ నాగదేవత దేవాలయాన్ని రంగురంగల పూలతో,విద్యత్ దీపాలతో చూడ ముచ్చటగా,భక్తులు పరువశమైయ్యే విధంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్ లు,విఐపీల క్యూలైన్లు ఏర్పాటు చేశారు.పూజలు,దర్శనాల అనంతరం భక్తులకు శ్రీలశ్రీ జయలక్ష్మీ అమ్మగారి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు కూడ ఏర్పాటు చేశారు.మొత్తం మీద ప్రశాంత వాతవరణంలో నాగుల పంచమి వేడుకలు జరిగాయి.