Film
RDX లవ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ..వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్
Kalinga Times,Hyderabad : RDX లవ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ శనివారం వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇందులో ‘హుషారు’ మూవీ ఫేం తేజస్, పాయల్ జంటగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ బావుందని, ఈ మంచి విజయం అందుకోవాలని చిత్ర బృందాన్ని విష్ చేశారు వెంకటేష్. ఈ పోస్టర్ చూస్తే ఎవరైనా టెమ్ట్ అవ్వాల్సిందే!
పాయల్ రాజ్ పుత్ అందాలనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ RDX లవ్ పోస్టర్ డిజైన్ చేశాను. అభిమానులు టెమ్ట్ అయ్యేలా, సినిమాలో పాయల్ నుంచి మీరు కోరుకునే విషయాలన్నీ ఉంటాయి అనే సంకేతాలు పోస్టర్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు. RDX లవ్ చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోంది. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు.