social
టీటీడీ ఆర్జిత సేవల టిక్కెట్ల విడుదల
Kalinga Times,Tirumala : నవంబరు నెల కోటా కింద శ్రీవారి వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం నవంబరు నెలకు 69,254 టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. వీటిలో 10,904 టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. మిగిలిన 58,350 టికెట్లను కరెంటు బుకింగ్ కింద అందుబాటులో ఉంచారు. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించే వాటిలో సుప్రభాత సేవకు 7,549, తోమాల సేవకు 120, అర్చనకు 120, అష్టదళ పాదపద్మారాధనకు 240, నిజపాద దర్శనం కోసం 2875 టికెట్లు ఉన్నాయి. కరెంటు బుకింగ్ కింద 58,350 టికెట్లను విడుదల చేయగా వీటిలో విశేష పూజ 1,500, కల్యాణోత్సవం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకరణ సేవకు 16,800 టిక్కెట్లు ఉన్నాయి.