Telangana
వరి నాట్లు నాటిన మంచిర్యాల కలెక్టర్
Kalinga Times, Mancherial : ఆమె ఒక జిల్లాకు .. బాస్ మాత్రమే కాదు.. సామన్యుల సంకల్పానికి వెన్నుదన్నుగా నిలిచి చేయూతనందించే మమతల తల్లి.ఆమెనే మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొళికెరి.జిల్లాలోని సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారానికి చొరవ చూపుతూ ప్రజాబిష్టానికి పెద్దపీట వేసి జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొంటోంది. . శనివారం రోజున సాగు చేస్తోన్న పంట పొలాల సరళిని పరిశీలించేందుకు మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోని గంగపల్లి గ్రామానికి కలెక్టర్ భారతి హొళికెరి వెళ్ళారు. అక్కడ పొలం పనులలో పనిచేసుకొంటున్న రైతులను పలకరించి సాగుబడి విశేషాలను తెలుసుకొన్నారు.పనిలో పనిగా వారితో వరి నాట్లు నాటారు.కలెక్టరమ్మ తమతో పాటు పొలం పనులు చేస్తుంటే రైతులు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.తర్వాత ఆనందంతో సంబరపడ్డారు.