Telangana
చింతల గట్టు చౌరస్తా వద్ద హరిత హారం
మొక్కలు నాటిన ఎమ్మెల్యే మాణీక్ రావు ,ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్

Kalinga Times,zahirabad : – Rajender, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల కేంద్రంలో చింతల గట్టు చౌరస్తా వద్ద ఎమ్మెల్యే మణీక్ రావు ,ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాణీక్ రావు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని సంకల్పం తో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం 5వ విడత హరిత హారం కార్యక్రమంలో బాగంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. నాటి వదిలేయకుండా అవి వృక్షాలుగా మారే వరకు బాధ్యతగా కాపాడాలన్నారు నాటే మొక్కలను విధిగా రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జడ్పిటిసి రాందాస్ ఎంపీపీ మాధవి ఎంపీడీవో వెంకట్ రామ్ రెడ్డి సర్పంచులు ఎంపిటిసిలు పంచాయతీ కార్యదర్శులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.