
Kalinga Times,Hyderabad : ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నాథ రథయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. లక్షల మంది భక్తజన సందోహంతో పూరీ విధులన్నీ కిటకిటలాడుతున్నాయి. హరోంహర: నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం.అయితే ఇంత రద్దీలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రశంసలు అందుకుంటోంది.. లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయిన రథయాత్ర కార్యక్రమం మధ్యలో ఓ అంబులెన్సు ఎటువంటి ఆటంకం లేకుండా ఆస్పత్రికి వెళ్లింది. 1,200 మంది వాలంటీర్లు, లక్షల మంది భక్తులు ఆ అంబులెన్సుకు దారి ఇచ్చి సమయస్ఫూర్తితో పాటు మానవత్వాన్ని చాటారు.