Andhra PradeshTelangana
తెలుగు రాష్ట్రాల పురోగతిపైనే చర్చ
టీడీపీ ని టార్గెట్ చేస్తూ వైసీపీ సభ్యులు రెచ్చిపోవడం సరైనదే
Kalinga Times,Hyderabad : హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సీఎం జగన్ తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో సమావేశమై. ముచ్చటించిన ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమైన విషయం విదితమే. కేసీఆర్‌తో భేటీ మర్యాదపూర్వకమేనని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఇద్దరు సీఎంలు ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ సమావేసాలు జరిగిన తీరు పై చర్చించినట్టు సబాచారం. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా సమావేశాలలో విపక్ష టీడీపీ ని టార్గెట్ చేస్తూ వైసీపీ సభ్యులు రెచ్చిపోవడం సరైనదేననని కెసిఆర్ జగన్ కు కితాబిచ్చినట్టు తెలుస్తోంది.భోగట్టా ..ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలపై ముఖ్యమంత్రులిద్దరూ గతంలో చర్చించిన నేపథ్యంలో ఆయా అంశాల్లో పురోగతిపై ఈ భేటీలో చర్చించారని ఈ నెల 8న రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఢిల్లీలో కీలక సమావేశం ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించి నట్లు సమాచారం