Film
మలయాళ నాయిక అనఘ టాలీవుడ్‌లోకి అరంగేట్రం
Kalinga Times,Hyderabad : గుణ 369 చిత్రంతో మలయాళ నాయిక అనఘ టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. కార్తికేయ కథానాయకుడిగా నటించారు. గుణ 369 చిత్రంలో నటించిన తన అనుభవాలను అనఘ మాట్లాడుతూ… నేను కేరళ అమ్మాయిని, ఇంజినీరింగ్ పూర్తిచేశాను. నటనపై ఆసక్తితో పరిశ్రమకు వచ్చాను. కొంత మోడలింగ్ అనుభవం తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో ప్రయత్నించాను.
తమిళం, మలయాళంలో రెండేసి చిత్రాల్లో నటించాను. ఇప్పుడు గుణ 369 సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్నాను. ఈ చిత్రంలో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. ఇలాంటి చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉంది. తొలి అర్థభాగంలో నా పాత్ర సరదాగా సాగుతుంటుంది. ద్వితీయార్థంలో కొంత భావోద్వేగంగా మారుతుంది. కార్తికేయతో నటించడం ఆనందంగా ఉంది. ఆయన నటించిన ఆర్‌ఎక్స్ 100 చిత్రాన్ని చూశాను. ఓ మంచి నటుడి సరసన నటిస్తున్నానని గుర్తుంచుకునే చేశాను. సినిమా బాగా వచ్చింది. నటిగా నన్ను ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటే చాలు అనుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దది, ఇక్కడకి నటిగా రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్నారు.