social
ప్రగతినగర్ ప్రాంతంలో అబ్బో పులి.. చివరకు వారే బలి..
Kalinga Times,Hyderabad : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం నుండి ప్రగతినగర్ ప్రాంతంలో చిరుత పులి కలకలం రేపింది. తర్వాత దానిని అధికారులు జంగపిల్లి అంటూ తేల్చేయడం మనకు తెలిసిందే. అయితే నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో లో ప్రగతి నగర్ లో గల గీతాంజలి స్కూల్ లోపల పులి దూరిందని అక్కడ పని చేస్తున్న వాచ్ మెన్ ప్రగతినగర్ కాలనీ వాసులను నమ్మించి భయాందోళనకు గురి చేసారు. సెక్యూరిటీ గార్డులే పులి ఉందని నమ్మించారు, స్థానిక పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గాలింపులు మొదలు పెట్టారు, నాలుగు రోజులుగా పులి కోసం వెతికారు, చివరికి రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు ఇలాంటి శబ్దాలు చేస్తున్నట్లు ప్రజలు గుర్తించారు, అలాగే స్కూల్ యాజమాన్యం కి ఫోన్ చేసి తెలిపారు, వీరిద్దరిపై అనుమానం వచ్చి పోలీసులకు కాలనీ వాసులు ఫోన్ ద్వారా పిర్యాదు చేసారు.పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు కావాలనే స్థానికులను భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలిపారు.అబ్బో పులంటూ చివరికి వారే బలయ్యారు