Telangana

నూతనంగా తెలంగాణ లెక్చర్స్ సిరీస్ ఏర్పాటు

Kalinga Times,Hyderabad : తెలంగాణ ప్రభుత్వం మరియు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్(TSCHE) సంయుక్తంగా ‘తెలంగాణ లెక్చర్ సిరీస్’ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంధర్భంగా బంజారా హిల్స్ లోని హోటల్ తాజ్ క్రిష్ణ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ‘తెలంగాణ లెక్చర్ సిరీస్’ కార్య,కలాపాల గురించి అధికారికంగా వెల్లడించడం జరిగింది. తెలంగాణ లెక్చర్ సిరీస్ అనేది ప్రతి నెలా నిర్వహించబడుతుంది. ఈ తెలంగాణ లెక్చర్ సిరీస్ లో విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుండి మాత్రమే కాకుండా భారతదేశం మరియు ఇతర దేశాలలో ఉన్న మన భారతీయులు పాల్గొనవచ్చు . ప్రతి నెల ఒక అంశంపై చర్చించడం వలన దీనిలోనే లోటుపాట్లు, అభివృద్ధి కార్యక్రమాలు, వారి వారి టాలెంట్ ను మెరుగు పరుచుకోవచ్చని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త జగదీష్ N సేతు, ప్రముఖ ఐఎఎస్ లు రాజీవ్ శర్మ, జనార్దన్ రెడ్డి, జయేష్ రంజన్, TSCHE(Telangana State Council of Higher Education) నిర్వాహకులు పాపిరెడ్డి, వెంకట రమణ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇక్ఫాయ్(ICFAI) యూనివర్సిటీ మద్దతుగా నిలిచింది

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close