Andhra Pradesh
అద్దంకిలో సోనీని కిడ్నాపర్ రవి వదిలేసి వెళ్లాడు
Kalinga Times,Addanki : వారం రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన సోనిని కిడ్నాపర్ రవి ప్రకాశం జిల్లా అద్దంకిలో మంగళవారం నాడు వదిలిపెట్టాడు. ఈ మేరకు పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.ప్రకాశం జిల్లా అద్దంకిలో సోనీని కిడ్నాపర్ రవిశేఖర్ వదిలేసి వెళ్లాడు. . సోని అద్దంకి నుంచి హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం.బళ్లారి నుంచి చోరీ చేసుకొచ్చిన కారులో రవిశేఖర్ ఈ నెల 23న యువతిని అపహరించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నిందితుడు రవిశేఖర్ బొంగులూరులో యువతిని, ఆమె తండ్రిని కారులో తీసుకెళ్లాడు. హయత్‌నగర్‌లో జిరాక్స్ కాగితాలు తెమ్మని యువతి తండ్రిని పంపాడు. ఆ తర్వాత యువతిని కిడ్నాపర్ రవిశేఖర్ అపహరించుకుపోయాడు. దీంతో యువతి అపహరణపై తండ్రి హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి ఆచూకీ కోసం గాలించారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువతిని కడప, కర్నూలు, చిత్తూరు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల గాలింపు ముమ్మరం కావడంతో భయపడిన కిడ్నాపర్ రవిశేఖర్ యువతిని అద్దంకి వద్ద వదిలివెళ్లాడు. నిందితుడు రవిశేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.