Telangana

మంచిర్యాలలో గోదావరి నదికి మహాహారతి

courtesy and video source by - Mancherial Local Person

Kalinga Times,Mancherial : కాళేశ్వరం జల జాతరలో భాగంగా మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి పుష్కర ఘాట్ లో మహా హారతి కార్య క్రమాన్ని స్థానిక శాసన సభ్యులు దివాకర్ రావ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రీదండి శ్రీమన్నారాయణ దేవానాథ జీయర్ స్వామి హాజరయ్యారై గంగమ్మ తల్లికి మహా హారతులు ఇచ్చారు. ఈ సంధర్భంగా స్వామిజీ మాట్లాడుతూ ఈవిధంగా గోదావరి నిండు కుంటుందని ఏనాడు ఎవరూ అనుకోలేదని,కాని అది మన కళ్ళ ముందే సాక్షాత్కరిచడం వెనుక కెసీఆర్ కృషి మరువలేదన్నారు. ఇది కేవలం రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యం అయిందని అన్నారు. హిందుసంప్రదాయంలో నదులన్నింటికి స్త్రీ మూర్తుల నామ కరణాలే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కొనియాడారు. అనంతరం భక్తులు హారతి, ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టి.బి.జి.కె.ఎస్ అధ్యక్షులు వెంకట్రావు జిల్లా చైర్ ప ర్షన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర,నడిపెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మంచిర్యాల పుర ప్రముఖులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close