Telangana
పలు ప్యాసింజర్ రైళ్ళు నేటి నుంచి రద్దు
Kalinga Times,Warangal : కాజీపేట-బల్లార్షా సెక్షన్ మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణం, బ్రిడ్జి మరమ్మతుల వల్ల కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను నేటి నుంచి రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే రామగిరి, బల్లార్షా-భద్రాచలం మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైళ్లను జూలై 30, 31, ఆగస్టు 1, 2, 8 తేదీల్లో రద్దు చేశారు. అయితే, ఈ రైలు వరంగల్ నుంచి భద్రాచలం రోడ్ వరకు రోజూ నడుస్తుందన్నారు. అజ్ని-కాజీపేట మధ్య నడిచే అజ్ని ప్యాసింజర్ రైలును కూడా ఈ నెల 30, 31న రద్దు చేస్తున్నట్లు తెలిపారు.