National
సియాల్‌కోట్‌లో ఓ హిందూ ఆలయాన్ని మళ్లీ తెరుస్తూ ..
Kalinga Times, Delhi : పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ఓ హిందూ ఆలయాన్ని మళ్లీ తెరుస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 72 ఏళ్ల క్రితం మూసివేసిన ఈ ఆలయాన్ని మళ్లీ భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సర్దార్ తేజా సింగ్ నిర్మించిన షావాలా తేజా సింగ్ ఆలయం భారత్, పాక్ విభజన సమయంలో మూతపడింది. అయితే భారత్‌లోని బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసిస్తూ 1992లో ఓ గుంపు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో హిందువులు ఇక్కడికి రావడం మానేశారు. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఆలయాన్ని తెరవాలని నిర్ణయించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ‘ప్రజలు స్వేచ్ఛగా ఎప్పుడైనా దర్శించుకోవచ్చు’..అని డిప్యూటీ కమిషనర్ బిలాల్ హైదర్ పేర్కొన్నారు. కాగా ఈ ఆలయ పునరుద్ధణ, పరిరక్షణ పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.