Andhra Pradesh
చాలా లోతుగా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం- జనసేన అధినేత
Kalinga Times, Amaravati : జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘మొట్టమొదటి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడినందుకు రాపాక వరప్రసాద్‌ని పవన్ అభినందించారు .పార్టీ నిర్మాణంలో భాగంగా వ్యక్తిగత ఎజెండా లేకుండా అందరూ పని చేయాలని పవన్ చెప్పారు. గత ఎన్నికల్లో పని చేసిన ప్రతి ఒక్క యువకుడికి కృతజ్ఞతలు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా చాలా లోతుగా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కావాల్సి ఉంది.’’ అని అన్నారు.