
జగిత్యాల లోకల్ న్యూస్ :జగిత్యాల జిల్ల పెగడపల్లి మండలం లింగాపూర్,శాలపెల్లి గ్రామాల ఎం.పి.టి.సి స్వతంత్య అభ్యర్థిగా పోటి చేస్తున్న కురిక్యాల ఉమా శేఖర్ కలింగ టైం స్ ప్రతినిధితో మాట్లాడుతూ 1995 లో మా మామ గారైన కురిక్యాల శంకరయ్యగారు లింగాపూర్,శాలపెల్లి ఎం.పిటి.సి గా గెలిచి మా గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు.ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి మినహా ఇప్పటివరకు మా గ్రామాలకు గొప్పగ చెప్పుకోవాల్సిన అభివృద్ధి ఏమి జరుగలేదన్నారు.దానికి నిదర్శనం ఈ గ్రామాలకు ఆయన కరిం నగర్ నుండి లింగా పూర్ వరకు చేసిన బస్ సౌకర్యం ..ఇప్పాటికి అది తప్ప వేరె ట్రిప్పు సౌకర్యానీ కూడా గత పాలకులు వేయించ్లేక పోయారని విమర్శించారు.
అలాగే శాలెపెల్లి అగ్గిమల్ల బ్రిడ్జ్ మరియు ఉప్పలపల్లి చెక్ డ్యాం తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేసి మా గ్రామాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఒక తరం మారినా మా గ్రామాలలో అభివృద్ధి జరుగలేదు.స్వంత పనులు చేసుకోవడానికి పదవిని అనుభవించారే తప్ప గ్రామాల అభ్వృద్ధికి కృషి ఎవరూ కృషి చేయలేదని విమర్శంచారు.
అందుకే మా గ్రామాల అభివృద్దికి మేము పాటు పడాలని నిర్ణయించుకొని కార్యాలయం కోసం ఒక గదిని కూడా నిర్మించి గ్రామ ప్రజలకు ఎప్పటికి అందు బాటులో ఉండాలని నిర్ణ్యించుకొని ఎం.పిటి.సి స్వతంత్ర్య అభ్యర్థిగా గ్రామ ప్రజల మద్దతు కోరుతున్నాము. మా గ్రామాల ప్రజలను మేము ఒకటే కోరుతున్నాము ఎవరు న్యాయంగా అభివృద్ధికి కృషి చేస్తారో ఆలోచించి ఓటు వేయలని అబ్యర్తి స్తున్నామని తెలిపారు.