Film
రకుల్ కు అంత పారితోషికం నష్టం ఏమీ కాదట
Kalinga Times,Hyderabad : నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మన్మధుడు 2’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆగస్టు 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. గత రెండేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పెద్దగా సక్సెస్ లేవు. అయినా కూడా మన్మధుడు 2 చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఇక ఈ చిత్రంలో నటించినందుకు గాను రకుల్ ఏకంగా దాదాపుగా కోటిన్నర వరకు వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమెను తీసుకుంటే అక్కడ మంచి బిజినెస్ అవుతుందనే ఉద్దేశ్యంతో అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే బాలీవుడ్ లో రకుల్ ఇటీవలే ‘దే దే ప్యార్ దే’ చిత్రంలో నటించి సక్సెస్ దక్కించుకుంది. అందుకే అక్కడ డబ్బింగ్ రైట్స్ ఎక్కువ మొత్తంకు అమ్మే అవకాశం కూడా ఉందని ఇంత పారితోషికం ఇచ్చి ఉండవచ్చు. నాగ్ భావించినట్లుగానే మన్మధుడు 2 చిత్రం హిందీ రైట్స్ భారీ మొత్తంకు అమ్ముడు పోయింది. కనుక రకుల్ కు అంత పారితోషికం నష్టం ఏమీ కాదని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.