National
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యెడియూరప్ప ప్రమాణస్వీకారం

Kalinga Times Banglore : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత యెడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో భారీగా బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య గవర్నర్ వాజుభాయ్ వాలా యడ్డీ చేత ప్రమాణస్వీకారం చేయగా బలనిరూపణ తర్వాతే మంత్రివర్గ కూర్పు, ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మూడుసార్లు సీఎంగా పనిచేసిన యడ్డి ఇప్పుడు నాలుగోసారి బాధ్యతలు తీసుకున్నారు. యడ్యూరప్ప పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చుకుంటే కలిసివస్తుందనే నమ్మకంతో యెడియూరప్పగా మార్చుకుని ప్రమాణస్వీకారం చేయడం విశేషం.ఈనెల 31న యెడియూరప్ప బలపరీక్ష చేసుకోనున్నారు. ఈరోజు సీఎంగా యెడ్డీ ఒక్కరే ప్రమాణస్వీకారం చేయగా బలపరీక్ష అనంతరమే మంత్రివర్గ కూర్పు చేపట్టనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడిన యెడియూరప్ప ప్రభుత్వ పాలనలో వైవిధ్యాన్ని చూపిస్తామని, రాజకీయ ప్రతీకార చర్యలకు దూరంగా, విపక్షాలను కలుపుకొని పోయి సుస్థిర పాలనను అందిస్తామన్నారు.