National
ఓటింగ్ లో కుమారస్వామి ఓటమి
Kalinga Times,Banglore : విశ్వాస తీర్మానంపై కర్నాటక అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ లో కుమారస్వామి ఓడిపోయారు. సభలో ఆయన ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానం 101-105 తో వీగిపోయింది. దీంతో ఆయన ప్రభుత్వం పతనమైంది. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 101 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. సభకు 18 మంది హాజరు కాలేదు. 15 మంది రెబల్స్, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు కాగా ఆరోగ్య కారణాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. దీంతో సభలో ఉన్న సంఖ్య ప్రకారం విశ్వాస తీర్మానం గెలవాలంటే 103 మంది సభ్యులు ఓటు వేయాల్సి ఉండగా కుమారస్వామి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 101 మంది మాత్రమే నిలిచారు. బీజేపీ సభ్యులు 105 మంది విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. కాగా విశ్వాస పరీక్షపై ఓటింగ్ సందర్భంగా మార్షల్స్ అసెంబ్లీ తలుపులు మూసేశారు