Andhra Pradesh
ప్రత్యేకంగా సీఎం జగన్‌కు క్షమాపణలు -గవర్నర్ నరసింహన్
Kalinga Times, Amaravati : గవర్నర్ నరసింహన్‌కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో గవర్నర్ నరసింహన్ భావోద్వేగానికి గురయ్యారు. ఏకంగా తొమ్మదిన్నార ఏళ్లు తాను గవర్నర్‌గా పని చేసిన రాష్ట్రం వీడుతున్నందుకు బాధగా ఉందని చెబు తూనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తెలిసి కొన్ని..తెలియక కొన్ని తప్పులు చేసానని అంగీకరించారు. ప్రత్యేకంగా సీఎం జగన్‌కు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. జగన్ చరిత్ర సృష్టిస్తారని ఆకాంక్షించారు. అదే సమయంలో జగన్ పాలనను అభినందించారు. రాష్ట్ర అధికారులను ప్రశంసించారు. ఇక, ఇదే సమయంలో గవర్నర్‌గా పరిధి దాటి కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ పైన ఒత్తిడి చేసానని చెప్పుకొచ్చారు. తన చిన్నకుమారుడి తరహాలో జగన్ తో వ్యవహరించానని భావోద్వేగానికి గురయ్యారు. సీఎం జగన్ సైతం నరిసంహన్ పైన ప్రశసంలు కురిపించారు. మంత్రు లు..అధికారులు గవర్నర్‌ను సత్కరించారు.