Telangana
తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ షాక్
Kalinga Times,Hyderabad : అసెంబ్లీ ఆమోదించిన కొత్త మున్సిపల్ బిల్లుకు గవర్నర్ బ్రేక్ వేశారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని ఈ మేరకు గవర్నర్ సూచించారు. కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్రానికి బిల్లు పంపాలని నిర్ణయించడమే కాకుండా దానిని రిజర్వ్‌లో ఉంచారు. అసెంబ్లీ ప్రొరోగ్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ సూచించిన సవరణలతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.