Telangana
చింతలేని గ్రామంగా చింతమడక…
Kalinga Times,Chintamadaka : ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. చింతమడకలో ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. చింతమడకవాసులతో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు సీఎం కేసీఆర్ వచ్చారన్నారు. ఉద్యమంలో కేసీఆర్‌కు చింతమడక బాసటగా నిలిచిందన్నారు. ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని, ఇల్లులేని వారికి ఇంటి నిర్మాణం చేయిస్తామన్నారు.