Kalinga Times,రంగారెడ్డి,ప్రతినిధి: నేటి కాలంలో జానెడు భూమి కావాలనుకుంటే అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే, అలాంటిది ఏమీ లేకుండా ఎవరి చుట్టూ తిరగకుండా అక్రమంగా పేకమేడల్లా నాలుగు అంతస్తుల వరకు రాజీవ్ గృహకల్ప లో నివసిస్తున్న లబ్ధిదారులు వాళ్ల పిల్ల జె ల్లా పేరుతో నిర్మించుకున్నారు, వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజక వర్గ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో అవినీతి ఏరులైపారుతోంది, పట్టుమని చూస్తే స్థానిక కార్పొరేటర్ కార్యాలయం కూత వేటు దూరంలోనే ఉంది. కనీసం ఆయన దృష్టికి కూడా రాకుండా నిర్మాణాలు ఎలా జరిగాయో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది, ఒకవేళ కార్పోరేటర్, స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీ కి ఎందుకు చెప్పలేదని ప్రశ్న తలెత్తింది, అసలు లేనోడికి ఇల్లే లేదంటే. ఉన్నోడే జాగ్రత్త పడి అక్రమ కట్టడాల కు పాల్పడుతున్నారు.
గతంలో రాజీవ్ గృహకల్ప కంపచెట్ల తో నిండిపోయి ఉండేది, అలాంటి దానిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు నీడ కల్పించాలని సదుద్దేశంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అర్హులైన నిరుపేదలకు రాజీవ్ గాంధీ పథకం పేరిట ఈ గృహాలను నిర్మించారు, అలాంటి దానిలో అసలైన ధనవంతులు, కార్యకర్తలకే ఇండ్లను మంజూరు చేసినట్లు సమాచారం, ఇలాంటి సందర్భాలలో రాజీవ్ గృహకల్ప పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయింది, నూతనంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది అక్రమంగా ఇండ్లను ఆక్రమించుకొన్నట్లు సమాచారం.ఈ అక్రమ కట్టడాల వెనుక ఎవరి అస్తo ఉందో తెలియడం లేదు.