Telangana
మంచిర్యాలలో పోడు భూములపై సిపిఐ ధర్నా
Kalinga Times,Mancherial : పోడు భూములపై సిపిఐ పార్టీ నేతలు ఈరోజు మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ గుండా మల్లేష్ ,సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కలవేన శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూములు చేసుకుంటున్న వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని ,సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఎలాంటి షరతులు లేకుండా పట్టాలు ఇవ్వాలని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ధర్నాలో పార్టీ ప్రజాసంఘాల నాయకులు గిరిజనులు పాల్గొనడం జరిగినది