social
ముహూర్తాలు మళ్ళీ కార్తీకంలోనే …
Kalinga Times,Hyderabad : సాధారణంగా ఆషాఢంలో అనగా ఒక నెల రోజులు ఏ శుభకార్యాలు చేయరు. అది అందరికీ తెలిసిన విషయమే. కాని ఈ సంవత్సరం శ్రావణ మాసంలో కూడా శుభ ముహూర్తాలు లేవు. కారణం ప్రస్తుతం శుక్ర మూఢం నడుస్తున్నది. మూఢం అనగా శూన్య మాసం అని కూడా అంటారు. ఈ సంవత్సరంలో ఏ శుభ కార్యాలు చేయరు. కాని అన్నప్రాసనలు లాటివి చేసుకోవచ్చు. శుక్రబలం గురు బలం అనేవి వివాహ, ఉపనయనాలకు తప్పనిసరి.
ఈ సమయంలో ఈ శుక్రుడు రవి ఇద్దరూ ఒకే రాశిలో ఉంటారు. రవితో ఏ గ్రహం కలిసినా అది అస్తంగత్వం అవుతుంది. అనగా తాను ఇచ్చే శుభ కిరణాలను భూమిపై ప్రసరింపజేయదు. ఆ శుభ కిరణాలు లేనప్పుడు దానినే అస్తంగత్వం అంటారు. ఈ కాలంలో శుభ గ్రహమైన శుక్రుడు బలహీనపడతాడు. ఈ బలహీనమైనప్పుడే అస్తంగత్వం చెందుతాయి.శుభగ్రహమైన శుక్రునికి సంబంధించిన మూఢం అనగా శుక్ర మౌఢ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా శుక్రుడు వివాహ కారకుడు. వివాహ భావనలు ఇప్పుడు లోపిస్తారు. స్త్రీ పురుషుల మధ్యలలో ఆ ఆలోచనలు అంత అనుకూలంగా ఉండవు. ఒకరిని ఒకరు ఆకర్షించుకునే శక్తి ఇప్పుడు తక్కువగా ఉంటుంది.
భాద్రపద మాసంలో మాములూగానే ముహూర్తాలు మళ్ళీ కార్తీకంలో ఉంటాయి. అందరూ కార్తీకమాసం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. మార్గశిరంలో కూడా ఈ సంవత్సంలో ముహూర్తాలు లేవు. మార్గశిర మాసంలో కూడా మళ్ళీ మూఢమి వస్తుంది. రవి కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుంచి దక్షిణాయనం మొదలౌతుంది. ఈ దక్షిణాయనంలో ఎక్కువగా నోములు వ్రతాలు మాత్రమే చేస్తారు. ఏ పని చేసినా శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకోవడం అనే ప్రక్రియ ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉంటుంది.
ఈ సమయంలో మూఢం కూడా రావడం వలన మానవ ప్రయత్నాలు అధికంగా చేయాలి. దైవం వైపు దృష్టి ఎక్కువగా నిలిపే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చేసే దీక్షలు అవి ఎక్కువ ఫలితాలనిస్తాయి. శరీరాన్ని కూడా బద్ధకించ కుండా ఉంచుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎవరి జాతకాలలోనైనా శుక్ర గ్రహం అనుకూలంగా లేకపోతే వారు కొంత జాగరూకులై ఉండాలి. ఈ 2 మాసాలు కూడా నిమ్మకాయ పులిహోర, అలంకరణ వస్తువులు, పూలు, డ్రై ఫ్రూప్ట్స్ వంటివి అధికంగా దానం చేయాలి.