Telangana
ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో విద్యార్థుల ఆందోళన
Kalinga Times,Hyderabad : రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ స్కూల్లో కరెంటు బిల్లు కట్టినప్పటికీ కరెంట్ కట్ చేయడం జరిగింది. కరెంట్ లేకపోవటం వల్ల త్రాగు నీరు లేక మధ్యాహ్న భోజననికి వంట చేయలేకపోయారు. ఆకలితో విద్యార్థులు అలమటిస్తూ ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించారు. ఈ సంఘటనపై స్థానిక నేతలు మాజీ ఎంపిటిసి జంగయ్య మరియు ఇతర నాయకులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నాయకులను కోరారు.