Telangana
కెపి.హెచ్.బిలో రమ్య సెంటర్ వద్ద ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చి వేత
Kalinga Times,Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై జిహెచ్ ఎంసి అధికారులు కొరడా ఝులిపించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఆదేశాల మేరకు కూకట్ పల్లి కెపి.హెచ్.బి కాలనీలోని రమ్య సెంటర్ వద్ద ఫుట్ పాత్ ను ఆక్రమించి రోడ్డు పైన నిర్మించిన షాప్స్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తొలగించారు. కూకట్ పల్లి లో ఉన్న ఆక్రమణలు గుర్తించడం జరిగిందని దీనిలో భాగంగానే ఈ రోజు రమ్య సెంటర్ వద్ద ఆక్రమణలు తొలగించడం జరిగిందన్నారు.ఆక్రమణల పైన స్పెషల్ డ్రైవ్ ఇలానే కొనసాగుతుందని తెలిపారు. ప్రతి పౌరుడు ఫుట్ పాత్ పై నడవడం వారి హక్కు, దానిని లెక్క చేయకుండా ఫుట్ పాత్ ఆక్రమణలకు పాల్పడితే వారి పై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. స్థానికులు మాత్రం మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి కూలగొట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తీసే వరకు ఆగకుండా జెసిబి తో కూల్చడం న్యాయం కాదంటూ వాపోయారు.