Andhra Pradesh
పవన్ కళ్యాణ్ ఆలోచనలకూ విరుద్ధంగా …
Kalinga Times,Amaravati : భవిష్యత్ రాజకీయాలపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని పవన్ జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జనసేనలోకి వచ్చే నాయకులకు ఆయన రెడ్ కార్పెట్ పరవనున్నారు. కానీ జనసేన పార్టీ వైపు చూస్తున్న వారి కంటే జనసేన నుండి పక్క పార్టీల వైపు చూస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ సైతం ఇప్పుడు జనసేన పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. జనసేనలో ఉంటె రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న ఆలోచనలో ఉన్నారని , తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు దారిలో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతుంది.
వలసలను పవన్ ఆపగలరా ?
ఒకపక్క ఏపీలో టీడీపీ ని ఖాళీ చేస్తామని బీజేపీ దూకుడు చూపిస్తున్న వేళ వైసీపీ నుండి జనసేన నుండి కూడా ఆషాడం తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక జనసేన నుండి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతలు ఎవరు అన్న చర్చ పార్టీలో జోరుగా ఆగుతుంది. ఒకపక్క గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకూ విరుద్ధంగా జగన్ భజన చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ అంశం కూడా పార్టీలో పలు సందేహాలకు తావిస్తుంది. ఇక ఈ నేపధ్యంలో పార్టీని బలోపేతం చెయ్యటం అటుంచి పార్టీలో ఉన్న కీలక నేతలు పార్టీ వీడకుండా కాపాడే ప్రయత్నం పవన్ చేస్తారా ? జనసేనలో ఇప్పటి వరకు స్తబ్దంగా ఉన్న నేతలు ఇప్పుడు జంప్ అంటారా ?అన్నది ఆసక్తికరంగా మారింది.