Andhra Pradesh
అమరావతి డెవలప్మెంట్ నుండి ప్రపంచ బ్యాంక్ తప్పుకుంది
Kalinga Times,Hyderabad : రాజధాని అమరావతి డెవలప్మెంట్ నుండి తప్పకుంటున్నట్లుగా ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రపంచ బ్యాంక్ అమరావతి నిర్మాణం కోసం 2,100 కోట్ల రుణసాయంతో పాటు అమరావతి అభివృద్ధికి అండదండలు ఇస్తామని ముందొచ్చింది. అయితే ఇప్పుడు రుణాసాయాన్ని నిలిపివేసిన బ్యాంక్ డెవలప్మెంట్ నుండి తప్పుకుంది. గత ప్రభుత్వ హయంలో రైతుల పేరిట అమరావతికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు మెయిల్స్ వెళ్లగా అప్పటి సీఎం చంద్రబాబు అధికారులను అమరావతికి రప్పించి వివరించి ఒప్పించారు.