Religious
శివుని అనుగ్రహంతో సంపదలకు అధిపతిగా కుబేరుడు
Kalinga Times,Hyderabad : కుబేరుడు త్రేతాయుగం శ్రీముఖ సంవత్సరం, ధనుస్సు రాశిలో జన్మించినట్లు చెప్తారు. శివభక్తుడైన కుబేరుడు దేవరాజు ఇంద్రునికి తగ్గినట్లు పుష్పక విమానంలో ప్రయాణించే హోదాను కలిగివుంటాడు. శివుని అనుగ్రహంతో సంపదలకు అధిపతిగా మారాడు. అలాంటి కుబేరుడిని లక్ష్మీదేవితో పాటు పూజించే వారికి సమస్త దోషాలుండవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు.సిరిసంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడిని చేర్చి పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రీ లక్ష్మీకుబేర పూజ ద్వారా అనుకున్నది సాధిస్తారని ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీని మాత్రమే పూజించకుండా శ్రీకుబేర లక్ష్మీ పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. శ్రీ మహాలక్ష్మీ దేవి శ్రీమంతుడి గుండెల్లో కొలువై వుంటుంది. అలాంటి దేవి.. దీపావళి రోజున మన ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అందుకే ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ముందే లక్ష్మీకుబేర పూజ చేయడం మంచిది. ఇంటిల్లిపాదిని దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికి పూజించినట్లైతే విశేష ఫలితాలుంటాయి.