Telangana
తెలంగాణ ప్రజలకు ఆగస్టు 15నుంచి సుపరిపాలన
Kalinga Times,Hyderabad : తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలనను అందించడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఆగస్టు 15నుంచి సుపరిపాలన అందిస్తామని ఆయన అన్నారు. కొత్త మున్సిపల్ చట్టంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో కేసీఆర్ ప్రసంగిస్తూ అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమన్నారు. దేశమే మన దగ్గర నేర్చుకునేలా పాలన సంస్కరణలు తెస్తామని, అలాగే ప్రజాదర్బార్ నిర్వహించి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని, పట్టణాలు, గ్రామాల్లో పచ్చదనం పెరగాలన్నారు. హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే సర్పంచుల పదవులు కూడా పోతాయని, 85 శాతం మొక్కలు బతికితేనే పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ ఉంటుందని కేసీఆర్ అన్నారు. మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్, ఇన్‌చార్జ్ ఆఫీసర్‌కు చెట్ల పెంపకం బాధ్యత అప్పగిస్తామని, ‘85 శాతం మొక్కలు బతికించాలి.. లేకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తాం’ అని కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల కోడ్‌లు అమల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజలు సుఖంగా బ్రతికే పరిస్థితి కల్పిస్తేనే తమను గౌరవిస్తారని ఆయన అన్నారు.