Andhra Pradesh
15రోజుల్లో టీడీపీ చేసిన స్కామ్ లన్నీ బయటకు..
Kalinga Times,Amaravati : 15రోజుల్లోనే టీడీపీ చేసిన స్కామ్ లన్నీ బయటకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పోలవరాన్ని స్కామ్ లతో కూడిన ప్రాజెక్టుగా టీడీపీ చేసిందన్నారు. పోలవరానికి రీటెండరింగ్ చేస్తే రూ.1500 కోట్ల వరకు మిగులుతాయని, గత ప్రభుత్వం సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో నచ్చిన వారిని తీసుకొచ్చి నామినేషన్ పద్ధతిలో వర్క్స్ ఇచ్చారని విమర్శించారు. యనమల వియ్యంకుడు పోలవరం సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్నారని, ఇటుక కూడా పడని చోట రూ.724 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చారని ఆరోపించారు. ఏ స్థాయిలో దోచుకున్నారో మరో 15 రోజుల్లో తేలిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.