National
జాదవ్ ఉరిశిక్షపై కోర్టు స్టే విధించడంపై

Kalinga Times,Delhi : జాదవ్ ఉరిశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టు స్టే విధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని ట్వీట్ చేశారు. వాస్తవాల ఆధారంగా తీర్పు వెలువడిందని గుర్తుచేశారు. జాదవ్‌కు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జాదవే కాదు ప్రతి భారతీయుడి సంక్షేమం కోం ప్రభుత్వం పాటుపడుతుందని ఉద్ఘాటించారు. దీంతో సత్యం, న్యాయమే గెలిచాయని పేర్కొన్నారు. ఇది మనకు అంతర్జాతీయ కోర్టులో లభించిన గొప్ప విజయమని అభివర్ణించారు. మరోవైపు జాదవ్ ఉరిశిక్షను పున:సమీక్షించాలన్న అంతర్జాతీయ కోర్టు తీర్పును గౌరవిస్తామని పాకిస్థాన్ లాయర్లు తెలిపారు. ఈ కేసులో భారత్ వాదనలు వినిపించనున్నది.