social
గుండె జబ్బులు రాకుండా ..
Kalinga Times,Hyderabad : గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే, మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంలో ఓట్ మీల్ తినాలి. ఓట్స్‌లోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వారంలో కనీసం 2 లేదా 3 సార్లు చేపలను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డార్క్ చాకొలెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. వీటిని తినడం వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.వాల్‌నట్స్‌లో ఉండే మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. అందుకే వీటిని నిత్యం తినాలి. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలిగిపోతాయి.