Film
ఆగస్ట్ 15న రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు కాజల్
Kalinga Times,Hyderabad : నటి కాజల్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన రణరంగం, కోమలి చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఆ రెండు చిత్రాలని మేకర్స్ విడుదల చేయనున్నారు. రణరంగం చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఇందులో గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు శర్వానంద్. ఈ చిత్రంలో కాజల్‌తో పాటు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఆగస్ట్ 2న విడుదల కావలసిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఆగస్ట్ 15న రిలీజ్‌కి సిద్ధమైంది.
జయం రవి, కాజల్, సంయుక్త హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తమిళ చిత్రం కోమలి. ఈ మూవీ కూడా ఆగస్ట్ 15న విడుదల అవుతుంది. ప్రదీప్ రంగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సరికొత్త కథాంశంతో రూపొందుతుంది. మొత్తానికి ఇండిపెండెన్స్ డే రోజు కాజల్ రెండు చిత్రాలతో ప్రేక్షకులకి మంచి వినోదం అందిస్తుంది.