social
గర్భం వల్ల ప్రమాదం ఉందని భావిస్తే మహిళల్లో ఒత్తిడి
Kalinga Times,Hyderabad : అబార్షన్ పై ఆంక్షలను ఎత్తివేయాలని, పిల్లల్ని కనడం మహిళల ఇష్టమని, చట్టపరమైన ఈ నిబంధన వల్ల మహిళల్లో ఒత్తిడి పెరుగుతోందని సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు ముగ్గురు మహిళలు. ఇక వీరి వాదన ఏంటి అంటే అబార్షన్ చేయించుకోవడం అనేది మహిళల ఇష్టంతో కూడుకున్న వ్యవహారం. పిల్లల్ని కనాలా వద్దా అనేది మహిళా నిర్ణయించుకోవలసిన అంశం . కాబట్టి మహిళ ఇష్టాయిష్టాలకు అబార్షన్ విషయాన్ని వదిలేయాలని అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛని పిల్ దాఖలు చేశారు స్వాతీ అగర్వాల్, ప్రాచీ వాట్స్ , గరిమా నక్సేరియా . వారు దాఖలు చేసిన పిల్ లో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ను 1971 నాటి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం హరిస్తోందని వారు పేర్కొన్నారు. ఇక చట్టంలోని సెక్షన్లు 3(2) 3 (4) 5 రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 32 లోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని వారు పేర్కొన్నారు. ఇక ఈ పిల్ పరిశీలించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్త ల ధర్మాసనం దీనిపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
12 వారాల గర్భాన్ని ఒక మెడికల్ ప్రాక్టీషనర్ తొలగించవచ్చని, గర్భం వల్ల ఆమె మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదం ఉందని భావిస్తే అబార్షన్ చేయవచ్చని ఉంది. అంతేకాకుండా రెండు వారాలు దాటి 20 వారాలలోపు అయితే ఇద్దరు డాక్టర్లు సర్టిఫై చేయాలని, వారి ఆమోదం లేకుండా అబార్షన్ చేయరాదని నిబంధన ఉంది. కానీ సదరు గర్భిణికి ప్రాణహాని ఉందని భావిస్తే ఆ గర్భాన్ని తొలగించవచ్చునని ఉన్న ఈ నిబంధనలను ముగ్గురు మహిళలు సవాల్ చేస్తున్నారు. మహిళ గర్భాన్ని ఉంచుకోవాలా, తీయించుకోవాలా అన్నది మహిళ వ్యక్తిగత స్వేచ్ఛని వారంటున్నారు. అంతేకాదు అది ఆమె గోప్యతకు నిర్ణయాధికారాన్ని సంబంధించినదని ఆమె శారీరక పరిస్థితిని, గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆమె నిర్ణయం తీసుకోవచ్చునని వారు పేర్కొన్నారు. అబార్షన్ విషయంలో ఆంక్షలు పెట్టడం వల్ల మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు .