Kalinga Times,Nagpur : ఒకేరోజు గంటల వ్యవధిలో పౌర్ణిమ, గ్రహణం. 150 ఏళ్ళ తర్వాత సాక్షాత్కరిస్తున్న అరుదైన ఘట్టం. ప్రతిసంవత్సరం హిందువులు ఆషాడపౌర్ణమిని వేదవ్యాసుని జయంతికి గుర్తుగా గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. మంగళవారం గురు పౌర్ణిమ. అయితే ఆ తర్వాత ఎనిమిది గంటల తేడాతో చంద్రగ్రహణం జరగ బోతోంది. ఇలా కొన్ని గంటలతేడాతో ఒకేరోజు గురుపౌర్ణిమ, చంద్రగ్రహణం రెండు సందర్భాలు రావడం అరుదుగా జరుగుతుంది. ఇంతకుముందు జూలై 12, 1870న ఒకే సమయంలో చంద్ర గ్రహణం, గురుపౌర్ణిమ వచ్చాయి. మళ్ళీ ఇపుడు దాదాపు 150ఏళ్ళ తర్వా త అలాంటి సందర్భం రాబోతోంది.
ఆలయాల మూసివేత
చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసి వేయనున్నారు. ఈ ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా మూసివేయనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు ఆలయాలను మూసి ఉంచనున్నారు.