social
ప్రియురాలిపై అనుమానం ..ఆమె ముఖాన్ని చిధ్రం చేశాడు
Kalinga Times,Nagpur : నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల ఖుషీ పరిహార్ మోడలింగ్ రంగంలో రాణించాలన్న ఆశతో లోకల్ ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. అవకాశాల కోసం చాలా మందితో మాట్లాడేది. అయితే అలా మాట్లాడటం ఆమె బాయ్ ఫ్రెండ్ అష్రఫ్ షేక్‌కు నచ్చేది కాదు. ఎన్నోసార్లు ఆ విషయాన్ని ఖుషీతో చెప్పాడు. అయితే ఆమె కెరీర్‌పై దృష్టి పెట్టి అతని మాటలు పట్టించుకోలేదు. దీంతో అతను ఆమెపై కోపంతో పాటు అనుమానం పెంచుకున్నాడు. ప్రియురాలిపై అనుమానం పెనుభూతంగా మారడంతో అష్రఫ్ ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పక్కా స్కెచ్ వేశాడు. జులై 12న కారులో ఖుషీని లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లాడు. నాగ్‌పూర్ హైవేపై ఓ సవ్లి ఫతా ప్రాంతంలో ఆమెపై దాడికి దిగాడు. ప్రతిఘటించిన ఖుషీని బండరాయితో మోది చంపాడు. ఎవరూ గుర్తు పట్టకుండా ఆమెను ముఖాన్ని చిధ్రం చేశాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ముఖం గుర్తు పట్టలేని విధంగా మారడంతో సోషల్ మీడియా అకౌంట్ ఆధారంగా ఆమెను గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆమె అష్రఫ్ తో కలిసి వెళ్లిన విషయం తెలుసుకున్న పోలీసులు అష్రఫ్ షేక్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నిందితుడు అసలు విషయం బయటపెట్టాడు. ఖుషీ చాలా మంది మగవారితో క్లోజ్‌గా ఉండటంతో ఆమె క్యారెక్టర్‌పై అనుమానంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. మర్డర్ కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.