Telangana
సిరిపురం బ్యారేజీలోకి నీటిని లిఫ్ట్ చేయడానికి మోటార్లు సిద్ధం
Kalinga Times,Manthani: మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరికి నీటిమట్టం పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు మూసివేయడంతో కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద బ్యాక్ వాటర్ పెరుగుతోంది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో 1, 3, 4, 6మోటార్లు ఆన్ చేసి నీటిని గ్రావిటీ కెనాల్లోకి విడుదల చేయడంతో నీరు అన్నారం బ్యారేజీలోకి చేరుతోంది. అన్నారం బ్యారేజీలో 2.33 టీఎంసీల నీటి నిల్వ చేరింది. అన్నారం బ్యారేజీలోకి మరో 2 మీటర్ల వరకు నీరు చేరితే మంథని వద్ద అన్నారం పంప్‌హౌజ్‌కు గోదావరి జలాలు చేరుకోనున్నాయి. అన్నారం పంప్‌హౌజ్ నుంచి సిరిపురం బ్యారేజీలోకి నీటిని లిఫ్ట్ చేయడానికి అధికారులు నాలుగు మోటార్లు సిద్ధం చేశారు. వరద ప్రవాహంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు.