Telangana
వ్యతిరేకంగా పని చేయడం వల్లే ఖతం చేశాం-మావోలు
మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు దారుణంగా హత్య
Kalinga Times,Hyderabad : భద్రాద్రి జిల్లాలో ఇన్‌ఫార్మర్ నెపంతో మాజీ ప్రజాప్రతినిధిని మావోయిస్టులు హత్య చేశారు. చర్ల మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మవోలు దారుణంగా హత్య చేశారు. ఈ నెల 8న శ్రీనివాసరావును మావోలు కిడ్నాప్ చేశారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందునే శ్రీనివాసరావును చంపామని మావోయిస్టులు చెబుతున్నారు. ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావు మృతదేహం దొరికింది. మృతదేహం వద్ద చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లేఖ దొరికింది. ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు.అలాగే ఆదివాసీలకు సంబంధించిన 70 ఎకరాల భూమిని పోలీసులు ప్రొద్భలంతో శ్రీనివాస్ లాక్కున్నాడని ఆ లేఖలో తెలిపారు. ఆదివాసీలకు , వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్ట్ లకు వ్యతిరేకంగా శ్రీనివాస్ పని చేయడం వల్లే అతడిని ఖతం చేశామని చర్ల – శబరి దళం కార్యదర్శి శారద పేర్కొన్నారు శ్రీనివాస్ హత్య తర్వాత ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల భయానక పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కూడా ప్రతికార దాడికి పాల్పడుతారనే అనుమానంతో ఏజన్సీ గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. శ్రీనివాస్ టీఆర్‌ఎస్ చెందిన వ్యక్తి కావడంతో అధికార పార్టీ నేతలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమ అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు.