social

వన్ నైట్ స్టాండ్.. తెల్లారగానే, ఎవరికివారే

పెళ్లి అనే బంధానికి పెద్దగా విలువ ఇవ్వడం లేదు

Kalinga Times,Hyderabad : పెళ్లైన మహిళను గతంలో కన్నెత్తి చూసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు కొత్త పొకడలు వచ్చాయి. దీంతో.. అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. స్త్రీ, పురుషుడు అన్న భావన తప్ప పెళ్లి అనే బంధానికి పెద్దగా విలువ ఇవ్వడం లేదు. ప్రస్తుతం అందరూ వన్ నైట్ స్టాండ్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు. అది కాపురాలను కూల్చేస్తుందన్న విషయం తెలిసి కూడా దానిపైనే ఆసక్తి పెంచుకుంటున్నారు.

ఒక రాత్రి సంబంధం. తెల్లారగానే, ఎవరికివారే. ఎవరి జీవితాలు వారివే. మళ్లీ కలుసుకోవచ్చూ, కలుసుకోలేకపోవచ్చూ. కలుసుకుంటే వారికి నచ్చితే వారి బంధాన్ని కొనసాగించొచ్చు. నచ్చకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు. కల్చర్ లైఫ్ అనే పేరిట వన్ నైట్ స్టాండ్ పేరిట పరాయి స్త్రీ తో ఎంజాయ్ చేస్తున్నారు.
అబ్బాయిల విషయానికి వస్తే ఎక్కువ మంది సెక్స్ చేయాలన్న ఫాంటసీ ఎక్కువగా ఉంటుందని అందులో భాగంగానే దీని కోసం ఆశ పడుతుంటారు. ఆ లైంగిక అనుభవంతో అతడి ఇగో బలపడుతుంది. మగవాడు దాన్నో విజయంగా భావిస్తాడు

.

ఈ మధ్యకాలంలో ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి పెళ్లైన స్త్రీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుండటం గమనార్హం. పెళ్లై పిల్లలు ఉన్నా తమలో అందం తగ్గలేదని ఎంతటి మగాడినైనా ఆకర్షించగలమనే భావనతో ఇలాంటి వాటిపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఈ విషయం భాగస్వాములకు తెలిస్తే మాత్రం జీవితాలు నాశనం అవుతాయాని కాపురాలు కూలిపోతాయని చాలా మంది ఆలోచించకపోవడం విచారకరం. ఒక్క రాత్రి కోసం కక్కుర్తి పడి కాపురాలు కూల్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close