National
బెదిరించి ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోంది-రాహుల్ గాంధీ
Kalinga Times,Hyderabad : అహ్మదాబాద్: ధన బలం, బెదిరింపులతో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. క్రిమినల్ పరువునష్టం కేసులో శుక్రవారంనాడిక్కడ కోర్టుకు హాజరైన రాహుల్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ డబ్బు వెదజల్లి, బెదిరించి ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోంది. గోవాలో, ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరిగిందో మీరు చూశారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే పని చేస్తున్నారు. ఇదే వాళ్ల పద్ధతి. వాళ్ల దగ్గర డబ్బుంది, అధికారం ఉంది. ఆ రెండిటినీ ప్రయోగిస్తున్నారు. ఇదే వాస్తవం’ అని రాహుల్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా పటిష్టమవుతుందని రాహుల్‌ను మీడియా ప్రశ్నించగా, నిజం కోసమే తమ పోరాటమని, అందులో తాము బలంగానే ఉన్నామని అన్నారు