
Kalinga Times,Hyderabad : సూరత్‌కు చెందిన ఓ వ్యక్తికి బెడ్రూంలోనే అత్యాధునిక ఫీచర్లున్న స్మార్ట్ టీవీని పెట్టించుకున్నాడు. దానికి వైఫై కనెక్ట్ చేసి శృంగార భరిత సైట్ల వీడియోలు చూసేవాడు. ఒకరోజు అలా వీడియోలు చెక్ చేస్తుండగా కనిపించిన దృశ్యం చూసి భార్యాభర్తలకు గుండె ఆగినంత పనైంది. దంపతులిద్దరూ తాము శృంగారంలో పాల్గొంటున్న వీడియో చూసి వారికి దిమ్మ తిరిగింది.తమ శృంగార దృశ్యాలను ఎవరు, ఎప్పుడు, ఎలా తీశారో తెలియక తలపట్టుకున్నాడు. రూంలో ఎవరైనా సీక్రెట్ కెమెరాలు పెట్టారేమోనని గదంతా వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తన బెడ్ రూంలో ఏకాంతంగా ఉన్న దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయో తెలియక తలలు పట్టుకున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే పరువు పోతుందన్న భయంతో సైబర్ ఎక్స్‌పర్ట్స్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన నిపుణులు బెడ్రూంలో అణువణువూ గాలించారు. చివరకు వీడియో ఎక్కడి నుంచి రికార్డ్ అయిందో కనిపెట్టారు. బెడ్రూంలో అమర్చిన స్మార్ట్ టీవీని పరిశీలించిన సైబర్ ఎక్స్పర్ట్స్ అందులో ఇన్‌బిల్ట్ కెమెరా ఉన్న విషయాన్ని గుర్తించారు. స్మార్ట్ టీవీకి రోజంతా వైఫై కనెక్ట్ అయి ఉండటం, ఆ సైట్లలో వీడియో చూడటంతో హ్యాకర్లు ఆ భార్యాభర్తల్ని టార్గెట్ చేశారు. స్మార్ట్ టీవీని హ్యాక్ చేసి వారి శృంగార దృశ్యాలను రికార్డ్ చేయడంతో పాటు దాన్నుంచే ఆ సైట్లలో అప్ లోడ్ చేసినట్లు గుర్తించారు. అసలు విషయం తెలిసి కంగుతిన్న ఆ భార్యాభర్తలు ఆ సైట్ల నుంచి తమ వీడియోలు ఎట్టకేలకూ డిలీట్ చేయించారు. రెండువైపులా పదునున్న కత్తిలాంటి టెక్నాలజీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, అందుకే జనం అప్రమత్తంగా ఉండాలని సైబర్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.