Telangana
టీఆర్ఎస్ నేతను తీసుకెళ్ళిన మావోయిస్టులు
Kalinga Times,Badradri Kathagudem : అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు, మాజీ ఎంపీటీసీని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చర్ల మండలం కొత్తూరు గ్రామంలో నల్లూరి శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతను మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఆయన ఇంటికి వచ్చిన మావోయిస్టులు ఆయన్ను తమవెంట తీసుకెళ్లారు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.