
Kalinga Times, Godavarikhani : రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 33 డివిజన్ లోని 5 ఇంక్లైన్ కాలనీ, పరశురాం నగర్, అంబేద్కర్ నగర్,అంబేద్కర్ ఉద్యానవనం పార్క్,ఆర్ జీవన్ కమ్యూనిటీ హాల్ పోచమ్మ గుడి వద్ద,గణేష్ మిత్రమండలి లలో స్వతంత్ర దినోత్సవం కార్యక్రమాలలో కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసికట్టుగా 74 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం అభినందించాల్సిన విషయమన్నారు. అలాగే డివిజన్లోని ప్రజలందరూ కలిసికట్టుగా ఉంటూ డివిజన్ అభివృద్ధి కోసం భాగస్వాములు కావాలని అలాగే డివిజన్ ఆదర్శ డివిజన్ గా తీర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలిపారు., డివిజన్లోని ప్రజలకు సీనియర్ సిటిజన్ మహిళలకు యువకులకు పిల్లలకు పేరుపేరునా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సీనియర్ సిటిజన్స్ మహిళలు పిల్లలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.