Andhra Pradeshsocial
సినిమాల్లో విజయం కోసం ఎలాగైతే తాపత్రయ పడ్డానో…అలాగే
వారంతా ఓటేయరని నాకు ముందే తెలుసు

Kalinga Times,Hyderabad : తానా 22వ మహా సభలకు పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు సినీ ప్రమఖులు హాజరై సందడి చేస్తున్నారు. తానా సభలకు హాజరైన పవన్ కళ్యాణ్ అందరూ ఊహించినట్లుగానే మొదటిసారి తన ఓటమి పై స్పందించారు. వేదికపై మాట్లాడిన పవన్ తన ఓటమి గురించి మరిచిపోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టిందని అన్నారు. ఓటమి కారణాలు వెతికేది కేవలం పిరికి వాళ్ళే అని, ధైర్యంగా నిలబడే వ్యక్తి ఆ ఓటమిని గుణపాఠంగా తీసుకొని రేపటి గెలుపు గురించి ఆలోచిస్తాడని పవన్ అన్నాడు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటమి పాలైనందుకు ఏ మాత్రం డిసప్పాయింట్ కావడం లేదని, వచ్చే ఎన్నికల కోసం పకడ్బందీగా కసరత్తులు చేస్తానని పవన్ పేర్కొన్నాడు. తాను జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తే వేల సంఖ్యలో జనం తరలిరావడం చూసి పవన్ గెలుపు ఖాయం అని కొందరు భావించారని అన్నారు. అయితే అలా వచ్చిన వారంతా ఓటేయరని తనకు ముందే తెలుసని చెప్పి ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. తాను స్కాములు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవనే తన ధ్యేయమని ఈ సందర్బంగా ఆయన అన్నారు.
తాను సినిమాలు చేస్తున్న సమయంలో ఖుషీ సినిమా తర్వాత చాలా కాలం ఎదురుచూస్తే అప్పుడు ‘గబ్బర్ సింగ్’ రూపంలో సక్సెస్ తన ఖాతాలో పడిందని , అప్పుడు వెయిట్ చేశాను ఇప్పుడు చేయలేనా? అని అన్నారు. సినిమాల్లో విజయం కోసం ఎలాగైతే తాపత్రయ పడ్డానో అదేవిధంగా రాజకీయాల్లో కూడా సుదీర్ఘ కాలం గెలుపు కోసం కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఇక సినిమాల్లోకి రావడం లేదని మరోసారి బల్లగుద్ది చెప్పారు. చావైనా, రేవైనా రాజకీయాల్లోనే ఉంటానని ఆయన స్పష్టం చేయడం మెగా అభిమానులు ఖుషీ చేస్తోంది